: ఆ 300 మంది ‘కారు’ దిగిపోయారు!
హైదరాబాదు నగరంలోని రాంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నేత అగిరి వెంకటేష్ అనుచరులు 300 మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్ కుమార్ వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలపై నమ్మకం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.