: 0001 కారు నెంబరు రూ.12 లక్షలు మాత్రమే!
వేలంపాటలో 0001 కారు నెంబరు రూ.12.31 లక్షల ధర పలికింది. రాజస్థాన్ రవాణా శాఖ నిర్వహించిన ఈ వేలంపాటలో జోథ్ పూర్ కి చెందిన ఓ కారు యజమాని ఈ నెంబరును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అక్కడ నిర్వహించిన వేలంపాటలో ఈ నెంబరే ఎక్కువ ధర పలికినట్లు రవాణా శాఖాధికారులు తెలిపారు.