: ఆళ్లగడ్డలో ఎన్నికలు యథాతథం: సీీఈసీ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుపనున్నట్లు సీఈసీ తెలిపింది. సెక్షన్ 52 ప్రకారం ఈసీ గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు జరపవచ్చన్న నిబంధనకు అనుగుణంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి ఇంటికి వెళుతూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించడంతో... తర్జనభర్జనలు పడిన అనంతరం చివరకు ఈసీ యథావిధిగా ఎన్నిక జరపాలని నిర్ణయించింది.