: మూడు రోజులు రాష్ట్రంలోనే ఉంటా: దిగ్విజయ్


మూడు రోజులు రాష్ట్రంలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ హైదరాబాదుకొచ్చిన దిగ్విజయ్ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగాలని కోరుకుంటున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామని దిగ్విజయ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News