: అధికారులు విందు సమావేశాల్లో పాల్గొనడం తప్పే: కలెక్టర్
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు రాజకీయ నేతలకు సంబంధించిన విందు సమావేశాల్లో పాల్గొనడం తప్పేనని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. ధర్మాన విందు సమావేశంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకున్నామని, ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామని ఆయన చెప్పారు. విందు రాజకీయాలపై అన్ని పార్టీలను హెచ్చరించామని ఆయన అన్నారు. అభ్యర్థులు ఇచ్చే టీషర్టులు, చీరలు తీసుకోవడం, విందు భోజనాలకు వెళ్లడం అక్రమమేనన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కలెక్టర్ కొన్ని సూచనలిచ్చారు.