: చంద్రబాబును జైలుకు పంపుతాం: కేసీఆర్
నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మి, ప్రభుత్వానికి రూ. 380 కోట్లు నష్టం చేకూర్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్నికల తర్వాత విచారణ జరిపిస్తామని... జైలుకు పంపుతామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ఫరేఖ్ ఎంత చెప్పినా వినకుండా... కనీసం కేబినెట్ లో కూడా పెట్టకుండా చంద్రబాబు నిజాం షుగర్స్ పై నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఫరేఖ్ ఈ మధ్యనే వెలువరించిన తన పుస్తకంలో ఈ విషయాన్నంతా బయటపెట్టారని చెప్పారు. బాబు మోసాలపై టీఆర్ఎస్ ప్రభుత్వంలో విచారణ జరుగుతుందని తెలిపారు.