: దుష్ట రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి: జేపీ
అవినీతి, దుష్ట రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాదులో ఇవాళ జేపీ మీడియాతో మాట్లాడుతూ... విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని వెంటనే భారత్ కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లధనం వెనక్కి తెస్తే దేశంలో నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. రాజకీయ నాయకులంతా దేశాన్ని దోచుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉందని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుతం కొద్ది మంది రాజకీయ నేతలు మాత్రమే దేశానికి మేలు చేస్తున్నారని జేపీ అన్నారు.