: మోడీ, బాబు, పవన్, పొన్నాల అందరూ నామీదే పడ్డారు: కేసీఆర్
ప్రతి ఒక్కరు తనను విమర్శించే పనే పెట్టుకున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పొన్నాల అందరూ తననే టార్గెట్ చేశారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అనే భయం వీరందరిలో ఉందని... అందుకే తనను విమర్శిస్తున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక... కబ్జా భూములన్నింటినీ వెనక్కు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రావాళ్ల కబ్జా భూములకు చంద్రబాబు పరిరక్షకుడైతే... మోడీ సూపర్ పరిరక్షకుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేతిలో నరేంద్ర మోడీ కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ లాంటి ఆంధ్రావాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని మోడీ ప్రసంగించడం సిగ్గుచేటని అన్నారు.