: సల్మాన్ 'కర్ణుడు' లాంటివాడు: తండ్రి సలీమ్ ఖాన్


నటుడు సల్మాన్ ఖాన్.. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో బ్యాడ్ బాయ్ గా పేరు పడ్డ వ్యక్తి. ప్రస్తుతం అదే పాప్యులారిటీ కొనసాగుతున్నా... కొంతమంది మిత్రులకు, తన వారికి, అభిమానులకు మంచి వ్యక్తి. కానీ, తన కొడుకు మహాభారతంలోని కర్ణుడు లాంటివాడని సల్మాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ అంటున్నారు. తన క్యారెక్టర్ ఎప్పుడూ క్లిష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో సలీమ్ మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు.

భారతాన్ని ఒక మతానికి సంబంధించిన పుస్తకంలా కాకుండా యువకుడిగా ఉన్నప్పటి నుంచే తాను చాలా సార్లు చదివానన్నారు. అందులో చోటు చేసుకునే చిన్న చిన్న మెలికలు తర్వాత కాలంలో పెద్ద ప్రభావాన్ని చూపాయన్నారు. అందులో కర్ణుడి పాత్రలానే తన పెద్ద కొడుకు సల్మాన్ వ్యక్తిత్వం ఉంటుందంటున్నారు. తప్పు వైపు నుంచి సల్లూ పోరాడుతున్నాడని చెప్పారు. పైకి నిశ్శబ్ధంగా ఉన్నా అంతర్గత సంఘర్షణలతో నిరంతరం యుద్ధం చేస్తుంటాడని వెల్లడించారు.

  • Loading...

More Telugu News