: రూ.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టుబడింది!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో వైశాలీ జిల్లా అంజన్ పీర్ చౌక్ వద్ద రూ. 40 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఆ సొమ్మును సీజ్ చేసి... ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదులో అమెరికా, యూఏఈ దేశాలకు చెందిన డాలర్లు, రియాల్ ఉన్నాయని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.