: శోభానాగిరెడ్డి భౌతికకాయం ఆళ్లగడ్డకు తరలింపు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాదు కేర్ ఆస్పత్రి నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు తరలించారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.