: శోభ లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి
శోభానాగిరెడ్డి మరణవార్త విని ఆమె తండ్రి, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్రంగా కలత చెందారు. చిన్నమ్మాయి లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... "ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరికంటే చిన్నమ్మాయి. చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె ఎన్నో విజయాలు సాధించింది. ఆమె ఇక లేదని తెలిసి... మా కుటుంబ సభ్యులందరికీ చాలా బాధగా ఉంది" అని అన్నారు.