: కళ్లను దానం చేసిన శోభ
రాజకీయ నాయకురాలిగా ఎంతో పేరు తెచ్చుకున్న శోభానాగిరెడ్డికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఆమెలో ఎక్కువగా ఉండేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అందువల్లే కాబోలు తన తదనంతరం తన కళ్లతో మరో ఇద్దరు ప్రపంచాన్ని చూడటానికి... తన కళ్లను ఆమె దానం చేశారు. కేర్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆమె కోరిక మేరకు డాక్టర్లు ఆమె కళ్లను సేకరిస్తున్నారు.