: ఆ ఆలయంలో మహిళావతారంలో ఆంజనేయుడు


ఆంజనేయుడు మహిళా రూపంలో దర్శనమివ్వడమా? ఆశ్చర్యకరంగా ఉందే అనుకుంటున్నారా? అవునండి. ప్రపంచంలో ఇలా మహిళా మూర్తి రూపంలో ఆంజనేయస్వామి దర్శనమివ్వడం ఒకే ఒక ఆలయంలోనే ఉంది. ఛత్తీస్ గఢ్ లోని రత్నపూర్ జిల్లాలో ఉన్న గిరిజాబంద్ హనుమాన్ ఆలయమే అది. ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. అలాగే, స్వామి విగ్రహం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కుడి భుజంపై సీతమ్మవారు, ఎడమ భుజంపై శ్రీరాముడు కొలువై ఉంటారు. ఇక్కడ కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన పృథ్వీ దేవ్ కు స్వామి కలలో కనిపించి ఒక చోట ఉన్న విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించాలని కోరినట్లు స్థల పురాణం. ఆ విగ్రహాన్ని వెలికి తీయగా మహిళా రూపంలో ఉన్నట్లు స్థానికులు చెబుతారు.

  • Loading...

More Telugu News