: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కన్నుమూత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి కన్నుమూశారు. నిన్న (బుధవారం) రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఇవాళ ఉదయం 11.05 గంటలకు శోభ తుదిశ్వాస విడిచారని కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.