: వారణాసి చేరుకున్న నరేంద్ర మోడీ
భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో వారణాసిలో లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు ఆయన మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో కలసి ర్యాలీగా బయల్దేరి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు.