: పవన్ ప్రచారం పవన్ దే, నా ప్రచారం నాదే: చిరంజీవి
తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై కేంద్రమంత్రి చిరంజీవి స్పందించారు. 'పవన్ ప్రచారం పవన్ దే, నా ప్రచారం నాదే'నని స్పష్టం చేశారు. తాను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనని తెలిపారు. ప్రియాంకపై మోడీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని... ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. మోడీ వ్యాఖ్యలను బీజేపీలోని మహిళా కార్యకర్తలు కూడా స్వాగతించరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ జీవనదిలాంటిదని... కాంగ్రెస్ ను ఓడించడం ఎవరి తరం కాదని చెప్పారు.