: అమెరికా ఎన్నికల్లో పోటీకి ముగ్గురు భారతీయ అమెరికన్లు రె‘ఢీ’


నవంబరు నెలలో జరగనున్న యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీపడుతున్నారు. 1968లో వియత్నాం యుద్ధంలో పోరాడిన రాజీవ్ పటేల్ అక్కడి ఉత్తర కరోలినా నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగనున్నారు. వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత పటేల్ నార్త్ కరోలినాలోని ఈస్ట్ స్పెన్సర్ నగరానికి మేయర్ గా ఎన్నికయ్యారు.

మరో భారతీయుడు అనిల్ కుమార్ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన మిచిగాన్ ప్రతినిధుల సభ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, మూడో అభ్యర్థి సతీష్ వర్జీనియా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇంజనీరింగ్ పట్టాను అందుకున్న అనంతరం వ్యాపారవేత్తగా మంచి పేరును సంపాదించుకున్నాడు.

  • Loading...

More Telugu News