: సౌకర్యవంతమైన ప్రయాణం కోసమే ఛార్జీల పెంపు : రైల్వే మంత్రి


తాజాగా పెంచిన రైల్వే ఛార్జీలను ఆ శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమర్ధించుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంకోసం, భ్రదత కోసమే ఛార్జీలు పెంచామని అన్నారు. కాగా, రాష్ట్రంలో 30 రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. వీటిని పూర్తి చేయాలంటే రూ.40వేల కోట్లు కావాలని మంత్రి చెప్పారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన..  రైల్వేలో 40వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తనకిచ్చిన పదవిని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగానే కృషి చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News