: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుంది: సుబ్రమణ్యస్వామి
ఉన్నత చదువులు లేని సోనియా ఉన్నత పదవులు ఆశిస్తున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విమర్శించారు. హైదరాబాదులోని ఆ పార్టీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వారిపై వస్తున్న విమర్శలకు సోనియా, రాహుల్లే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.