: కేర్ ఆసుపత్రికి వెళ్లిన నిర్మాత అల్లు అరవింద్
వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కేర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో శోభ కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలోనే శోభ కుటుంబంతో అరవింద్ కు అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె వైఎస్సార్సీపీలోకి వెళ్లారు.