: ఆర్మీ కొత్త సారథిగా దల్బీర్ సింగ్


ఆర్మీ కొత్త సారథిగా ప్రస్తుతం వైస్ చీఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకం దాదాపుగా ఖరారైపోయింది. ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ పోస్టు కోసం ఐదుగురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. అందరిలోకీ సుహాగే సీనియర్. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిక్రంసింగ్ పదవీ కాలం జూలై 31తో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి పేరును కేంద్రం ఖరారు చేయాల్సి ఉంది. అయితే, అధికారం నుంచి వెళ్లిపోయేముందు కేంద్ర సర్కారు ఇలాంటి కీలక పదవుల నియామకం చేపట్టడం సరికాదని బీజేపీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నియామకాలను ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News