: నోటీసు అందలేదు... అందిన తర్వాత స్పందిస్తా: కేవీపీ


టైటానియం కుంభకోణంలో వైఎస్ ఆత్మ కేవీపీని ప్రొవిజనల్ (ముందస్తు) అరెస్ట్ చేయడానికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా దర్యాప్తు అధికారులు ఢిల్లీలో మకాం వేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ సీఐడీ విభాగాలకు సీబీఐ లేఖలు కూడా రాసింది. ఈ క్రమంలో కేవీపీ చూట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ సందర్భంగా కేవీపీ స్పందనను మీడియా ప్రతినిధులు కోరారు. దీనికి సమాధానంగా " వార్తలు రాయడం మీ డ్యూటీ. మీ పని మీరు చేస్తున్నారు. కానీ, మీ వార్తలను ఆధారంగా చేసుకుని స్పందించమంటే... నేనేం చెప్పాలి? నాకింకా దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. నోటీసులు అందితే, అందులో ఏముందో చూసి అప్పుడు స్పందిస్తా" అని చెప్పారు.

  • Loading...

More Telugu News