: రాజకీయాల్లోకి వినాయక్..!?


యాక్షన్ కథాంశాలను సరికొత్త టేకింగ్ తో తెరకెక్కించే దర్శకుల్లో వీవీ వినాయక్ ది ప్రముఖ స్థానం. 'ఆది' నుంచి నేటి 'నాయక్' వరకు వినాయక్ ప్రస్థానం అలాగే సాగింది. అయితే, ఇప్పుడా సక్సెస్ ఫుల్ డైరక్టర్ రూటు మార్చనున్నట్టు సమాచారం. సినిమాలను పక్కనబెట్టి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వినాయక్ భావిస్తున్నాడట. 

ఈ క్రమంలో, వినాయక్.. వైఎస్సార్సీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని సినీ వర్గాల భోగట్టా. 2014 ఎన్నికల్లో స్వస్థలం చాగల్లు నుంచి పోటీ చేయాలని వినాయక్ నిర్ణయించుకున్నాడట. తన తండ్రి గతంలో పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసిన సమయంలో వినాయక్ ప్రచారం చేయడంతోపాటు టీడీపీ తరుపున తండ్రిని గెలిపించుకున్నాడు కూడా.

అనంతరం వినాయక్ తండ్రి 'చిరు' పార్టీ 'ప్రజారాజ్యం'లో చేరాడు. ఇటీవలే ఆయన మరణించడంతో వినాయక్ చూపు జగన్ పార్టీ వైపు మళ్ళిందంటున్నారు. టిక్కెట్ కోసం ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్.. అల్లు అరవింద్ రెండో తనయుడు అల్లు శిరీష్ తో ఓ చిత్రం, బెల్లంకొండ సురేష్ తనయుడితో ఓ చిత్రం అంగీకరించినట్టు తెలుస్తోంది. వీటి తర్వాత జూ. ఎన్టీఆర్ తో మరో సినిమా ఉంది. ఈ ఊహాగానాలే గనుక నిజమై, వినాయక్ ఎన్నికల్లో పాల్గొని గెలిస్తే, మళ్ళీ మెగా ఫోన్ పట్టడం కష్టమేననిపిస్తోంది. 

  • Loading...

More Telugu News