: ఏపీ రాజధాని అంశంపై శివరామకృష్ణన్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఢిల్లీలో సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో శివరామకృష్ణన్, ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్ రాజధాని ప్రత్యామ్నాయాల అధ్యయనంపై చర్చించనుంది. అంతేగాక అనుసరించాల్సిన కార్యాచరణను కూడా కమిటీ ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ఇప్పటికే రాజధానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ కమిటీ రాష్ట్ర ప్రజలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.