: శోభానాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఫోన్ లో ఆరా తీసిన జగన్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ సోమరాజుతో పాటు, ఇతర ప్రముఖ వైద్యులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శోభ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరగా, జగన్ సతీమణి భారతి కడప నుంచి హైదరాబాద్ బయల్దేరారు.