: పార్టీ వేరుకావచ్చు... అనుబంధంతోనే వచ్చా: నన్నపనేని


రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి చికిత్స పొందుతున్న కేర్ హాస్పిటల్ కు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీలు వేరు అయినా, వీరితో ఉన్న అనుబంధంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. శోభ, ఆమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, భర్త నాగిరెడ్డితో కలసి తాను పనిచేశానని... గతంలో అందరం ఒకే పార్టీలో ఉన్నామని గుర్తుచేశారు. వారి కుటుంబానికి, తన కుటుంబానికి చాలా అనుబంధం ఉందని చెప్పారు. ఆ అనుబంధంతోనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నేతలందరూ రాత్రి వేళల్లో కూడా వేగంగా ప్రయాణిస్తుంటారని... నేతలందరూ రాత్రి వేళ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News