: కాశీలో నేడు నామినేషన్ వేయనున్న నరేంద్రమోడీ


హిందువులు పరమపవిత్రంగా భావించే కాశీలో నేడు నరేంద్రమోడీ లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ప్రత్యర్థి కేజ్రీవాల్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మాల్దియా నుంచి మోడీ రోడ్ షో ద్వారా బయల్దేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకల్లా నామినేషన్ వేస్తారని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పేయి చెప్పాయి. ఇక్కడ మే 12న పోలింగ్ జరగనుంది. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లోని వదోదర లోక్ సభ స్థానం నుంచి కూడా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News