: శోభానాగిరెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి: మైసూరా రెడ్డి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డిని కేర్ వైద్యులు పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శోభకు తగిలిన గాయాలు చాలా పెద్దవని చెప్పారు. తలకు బలమైన గాయమయిందని, పక్కటెముకల దగ్గర మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయని చెప్పారు. పక్కటెముకల గాయాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తలకు అయిన గాయమే తీవ్రమైనదని చెప్పారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారని చెప్పారు.