: ప్రయివేటు స్కూళ్లపై లోకాయుక్త మండిపాటు


ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడంపై ఆంధ్రప్రదేశ్  లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. విద్యాహక్కు చట్ట ప్రకారం ఏప్రిల్ 15 తర్వాతే అడ్మిషన్లు చేపట్టాల్సి ఉండగా అంతకుముందే ఈ ప్రక్రియను పూర్తి చేసిన హైదరాబాద్ లోని పలు ప్రయివేటు స్కూళ్లపై మండిపడింది. తక్షణమే వీటి అడ్మిషన్లు రద్దు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. అంతేకాక 9వ తేదీలోగా స్కూళ్లపై ఓ నివేదికను సమర్పించాలని చెప్పింది.

ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్ల తీరుపై 'బాలల హక్కుల సంఘం' లోకాయుక్తను ఆశ్రయించింది. వీరి పిటిషన్ ను పరిశీలించిన లోకాయుక్త.. అడ్మిషన్లకు ప్రయివేటు స్కూళ్లు ఎంట్రెన్స్ టెస్టులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్త చేసింది.  పిటిషన్ లో పేర్కొన్న.. జాన్సన్ గ్రామర్ స్కూల్, జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, చిన్నయ స్కూల్, భారతీయ విద్యా భవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నాజర్ స్కూల్, బచ్ పన్ స్కూల్, శ్రీ చైతన్య టోక్నో స్కూల్స్, సుప్రభాత్ గ్రామర్ స్కూళ్ల అడ్మిషన్లు కొన్ని రోజుల్లో నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News