: నాగం జేఏసీలో భాగమే: కోదండరాం, శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాజకీయ జేఏసీలో తనను చేర్చుకోకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని, జేఏసీ సమావేశాలకు ఆహ్వానించడం లేదంటూ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. జేఏసీ కార్యక్రమాలకు నాగంను కూడా ఆహ్వానిస్తున్నామని కోదండరాం స్పష్టం చేసారు.
జేఏసీ సమావేశాలలో నాగం కూడా పాల్గొనాలని కోరారు. ఇక, జేఏసీలో నాగం జనార్ధన్ రెడ్డి కూడా సభ్యుడేనని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాగం పార్టీ తెలంగాణ నగారా సమితిని జేఏసీలో చేర్చుకునే విషయమై త్వరలోనే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.