: ఈ ‘దూకుడు’కి ‘రికార్డు’లు బద్దలయ్యాయి!


ప్రపంచంలోని ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫా నుంచి ఇద్దరు యువకులు కిందకు దూకి రికార్డును బద్దలుకొట్టారు. దుబాయిలోని 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై నుంచి విన్స్ రెఫెట్, ఫ్రెడ్ ఫుగెన్ అనే ఇద్దరు ఫ్రెంచ్ యువకులు కిందకు దూకారు. వీరిద్దరూ జంప్ సూట్లు ధరించి ఈ ఫీట్ కు సిద్ధమయ్యారు. వీటికి గాలికి ఉబ్బిపోయి, రెక్కల్లా పనిచేసే పరికరాలు ఉంటాయి. వారు పక్షుల్లా ఎగిరి కిందకి దిగేందుకు వీలుగా ఈ సూట్స్ ధరించి జంప్ చేశారు.

2010లో నాసిర్ అల్ నెయాదీ, ఒమర్ అల్ హెగెలాన్ అనే ఇద్దరు యూఏఈ యువకులు 672 మీటర్ల ఎత్తు నుంచి కిందకు జంప్ చేశారు. అదే ఇప్పటివరకూ ప్రపంచ రికార్డు. ఇప్పుడు ఫ్రెంచ్ యువకులు ఈ రికార్డును బ్రేక్ చేశారు.

  • Loading...

More Telugu News