: అంగారక గ్రహాన్ని చూడడమే నా అంతిమ లక్ష్యం: సునీతా విలియమ్స్
భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత్ లో పర్యటనను ప్రారంభించారు. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ఆమె, ఇక్కడి 'జాతీయ సైన్స్ సెంటర్' ను సందర్శించారు. అనంతరం ఎంపిక చేసిన విద్యార్ధలు, ఉపాధ్యాయులు, పలువురితో సమావేశమై, తన అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకు న్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత.. అంగారకగ్రహాన్ని చూడటమే తన అంతిమ లక్ష్యమని తెలిపింది.
అంతరిక్షంలో తనకు ఎలాంటి గ్రహాంతరజీవులు (ఏలియన్స్) తారసపడలేదని ఆమె నవ్వుతూ చెప్పింది. అంతరిక్షంలో తనతోపాటుగా ఉపనిషత్తులు, భగవద్గీత కాపీలను తీసుకెళ్లా