: కేవీపీ అరెస్టు కోరుతూ అమెరికా దర్యాప్తు సంస్థ లేఖ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పెద్ద చిక్కులోనే పడ్డారు. టైటానియం కుంభకోణం వ్యవహారంలో ఆయన అరెస్టు కోరుతూ అమెరికా దర్యాప్తు సంస్థ సీబీఐకి లేఖ అందించింది. కేవీపీని ప్రొవిజినల్ అరెస్టు చేయాలని రెడ్ నోటీసు ఇచ్చింది. వెంటనే ఆ లేఖను సీబీఐ... సీఐడీ-ఏడీజీకి పంపింది. అయితే, తాము పంపిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పింది.