: మా పార్టీని ఎందులోనూ విలీనం చేయం: బైరెడ్డి కూతురు శబరి
రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని మరే పార్టీలోనూ విలీనం చేయడం లేదని ఆ పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ పొత్తు కూడా పెట్టుకోలేదని చెప్పారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయని... ఆ భయంతోనే నందికొట్కూరు అభ్యర్థి శేషన్న పోటీ నుంచి తప్పుకున్నారని తెలిపారు. ఎవరెంత బెదిరించినా తాము భయపడమని అన్నారు.