: ఇన్నాళ్లు కేసీఆర్ ఎక్కడ పడుకున్నాడో అందరికీ తెలుసు: కిషన్ రెడ్డి


తెలంగాణ తానే తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్... పార్లమెంటుకు ఏనాడూ వెళ్లలేదని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని కేసీఆర్ ఇన్నాళ్లు ఎక్కడ పడుకున్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పేద ప్రజల సంక్షేమం కన్నా తన కుటుంబ సంక్షేమమే కేసీఆర్ కు ఎక్కువని అన్నారు. పేదల కోసం పరితపించే మోడీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని తెలిపారు. కేవలం ఒక్క సీటు ఉన్న టీఆర్ఎస్ తెలంగాణను సాధిస్తుందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News