: నాగేశ్వర్ దీక్షతో దిగొచ్చిన ఆర్టీసీ


ఎమ్మెల్సీ నాగేశ్వర్ శాంతించారు. నిధులు కేటాయించినా బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించడానికి అధికారులు శ్రద్ధ చూపటం లేదంటూ.. నిరసనగా నాగేశ్వర్ ఈ ఉదయం హైదరాబాద్ లోని బస్ భనవ్ ముందు దీక్ష చేపట్టారు. ఎండీ వచ్చి లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ నిరసన కొనసాగుతుందని తెలిపారు. దీంతో రవాణా శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ, ఆర్టీసీ అధికారులు దిగి వచ్చారు. చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నాగేశ్వర్ తన దీక్షను విరమించారు. 

అనంతరం నాగేశ్వర్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలోని బస్టాండ్లలో తాగునీరు లేక ప్రజలు 20 రూపాయలు పెట్టి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి ఉందన్నారు. చలివేంద్రాల ఏర్పాటుకు 55 లక్షలు కేటాయించినా అధికారులు చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోనందునే దీక్ష చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

  • Loading...

More Telugu News