: మోడీ అహంకారి... బాబు తెలంగాణ ద్రోహి: శ్రవణ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని టీకాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబును పక్కన పెట్టుకుని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణ గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. నిన్నటి మోడీ ప్రసంగం మొత్తం చంద్రబాబు స్క్రిప్టేనని ఎద్దేవా చేశారు. మోడీ వ్యవహార శైలి రాచరికం, అహంకారానికి నిదర్శనమని అన్నారు.