: కల్యాణదుర్గం పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్రప్ప తప్పుకున్నారు. వెంటనే తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో, చేసేదిలేక ఇదే స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి సంజీవప్పకు హస్తం మద్దతు ప్రకటించింది. ఏపీ పీసీసీ అధ్యక్షుడైన రఘువీరా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పోటీ చేయకపోవడం ఆశ్చర్యపరిచే విషయం.