: భార్య, ముగ్గురు కుమార్తెలను సజీవదహనం చేసిన కిరాతకుడికి ఉరిశిక్ష
కట్టుకున్న భార్య, ముగ్గురు కన్న కూతుర్లను సజీవ దహనం చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్ లోని ఓ స్థానిక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 2008 జనవరిలో యూపీలోని దౌరియాలో హసీమ్ షేక్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని మొత్తం సజీవదహనం చేశాడు. ఈ ఉన్మాదికి ఉరిశిక్ష విధించడంపై అతని బంధువులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.