: దేశంలో వాట్స్ యాప్ యూజర్లు 4.8 కోట్లు


భారత్ లో తమకు 4.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు వాట్స్ యాప్ వ్యవస్థాపకుడు జాన్ కోమ్ తెలిపారు. వాట్స్ యాప్ 50 కోట్ల యాక్టివ్ యూజర్ల మార్కును దాటిందని ఆయన బ్లాగ్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అయ్యారని తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత్, బ్రెజిల్, రష్యాలో వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు చెప్పారు. వాట్స్ యాప్ అప్లికేషన్ ద్వారా మెస్సేజ్ లు, వీడియోలు, ఫొటోలను వేగంగా, సులభంగా, ఉచితంగా షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిని కొనుగోలు చేసేందుకు ఫేస్ బుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వాట్స్ యాప్ తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తమ యూజర్లు రోజులో 70 కోట్ల ఫొటోలు, 10 కోట్ల వీడియోలను షేర్ చేసుకుంటున్నారని కోమ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News