: తల్లీ కొడుకుల పాలనంతా అవినీతి, కుంభకోణాలే: నరేంద్ర మోడీ
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పక విజయం సాధిస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన అన్నారు. ఈరోజు ఆయన గుజరాత్ రాష్ట్రంలోని కలోన్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. యూపీఏ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, తల్లీ, కొడుకుల పాలనలో అవినీతి, కుంభకోణాలే గానీ, అభివృద్ధి జాడే లేదన్నారు. బ్లాక్ మనీపై యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.