: తూర్పుగోదావరిలో రూ.కోటి 50 లక్షలు పట్టుబడ్డాయ్!
తూర్పుగోదావరి జిల్లాలో కారులో తరలిస్తున్న రూ. కోటి 50 లక్షలు పట్టుబడ్డాయి. ఎన్నికల సీజన్ కావటంతో రామచంద్రాపురం ముచ్చిమిల్లి రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న కోటిన్నర రూపాయలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.