: 2015 నాటికి హిందూ రాష్ట్రంగా గుజరాత్: వీహెచ్ పీ


గుజరాత్ రాష్ట్రాన్ని 2015 నాటికి హిందూ రాష్ట్రంగా ప్రకటస్తామని విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ భాయ్ తొగాడియా చెప్పారు. మరో రెండేళ్లలో గుజరాత్ లోని మొత్తం 18వేల గ్రామాలకూ వీహెచ్ పీ విస్తరిస్తుందని.. దాంతో 2015 నాటికి హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆయన ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో తెలిపారు.

వీహెచ్ పీ కార్యకలాపాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లేందుకు 'హిందూ సంఘం' పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తొగాడియా పాల్గొని మాట్లాడారు. వీహెచ్ పీ 2014 నాటికి 50ఏళ్లను పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో అయోథ్యలో రామాలయం అంశంపై తొగాడియా స్పందిస్తూ.. ప్రవర్తన ద్వారా కాకుండా... పాటించే చర్యలు, చైతన్యం ద్వారా హిందువులుగా మారినప్పుడే అయోధ్యలో రామాలయం కల నెరవేరుతుందన్నారు. 

  • Loading...

More Telugu News