: పేరు మార్చుకున్న కాడ్బరీ ఇండియా


ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన బహుళజాతి కంపెనీ కాడ్బరీ ఇండియా తన పేరును మార్చుకుంది. కాడ్బరీ ఇండియా పేరు ఇక నుంచి మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ లిమిటెడ్ గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. కాడ్బరీ ఇండియా తన మాతృ సంస్థ మోండెలెజ్ ఇంటర్నేషనల్ కు అనుబంధ సంస్థగా ఉంది. గ్రూపు కంపెనీల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పేరు మార్చినట్లు తెలుస్తోంది. అయితే, పేరు మారినా డైరీ మిల్క్, ఫైవ్ స్టార్ తదితర ఉత్పత్తుల ప్యాకింగ్ లో మార్పులు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News