: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న గ్యాంగ్ స్టర్


గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కిడ్నీ సమస్యల కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇతడు మలేసియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. దావూద్ ఇబ్రహీంకు, చోటా రాజన్ కు మధ్య బద్ధవైరం కొనసాగుతోంది. దావూద్ ను అంతం చేయకుండా తాను చావనని స్నేహితుడైన ఓ హోటల్ వ్యాపారితో రాజన్ చెప్పినట్లు సమాచారం. 2001లో దావూద్ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో రాజన్ కు గాయాలవగా... దానికి సంబంధించి తాజాగా కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. అప్పట్లో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరితే తనను పోలీసులు పట్టుకుని భారత్ కు పంపే ప్రమాదం ఉందనే భయంతో రాజన్ సరైన చికిత్స తీసుకోలేదు. అదే ఇప్పుడు అతడి ఆనారోగ్యానికి కారణమైనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News