: ప్రచారం చేయమని హరికృష్ణను అడగలేదు: బాలకృష్ణ


తన తరపున ప్రచారం చేయాలని అన్నయ్య హరికృష్ణను అడగలేదని సినీ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ప్రచారానికి రమ్మని ప్రత్యేకించి ఆహ్వానించలేదని ఆయన స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రచారానికి రావాల్సిందిగా తానెవ్వరినీ కోరలేదని ఆయన చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారిలో చాలామందికి టిక్కెట్లు ఇవ్వలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... పార్టీ కోసమే అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాలయ్య అన్నారు.

  • Loading...

More Telugu News