: టీడీపీలో విలీనం దిశగా బైరెడ్డి పార్టీ చర్చలు


బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాపించిన రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని టీడీపీలో విలీనం చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని బైరెడ్డి కుటుంబీకులు కూడా ధృవీకరించారు. అయితే, ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని వారు స్పష్టం చేశారు. 52 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో రాయలసీమ పరిరక్షణ సమితి పోటీ చేస్తోంది. ఈ స్థానాలలో బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునే దిశలో టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో, ఆ పార్టీ సారథ్య బాధ్యతలను ఆయన కుమార్తె డాక్టర్ శబరి చేపట్టారు. ఆమె కర్నూలు జిల్లా పాణ్యం నుంచి పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News