: వాజ్ పేయిలా మోడీ సెక్యులర్ నేత ఎన్నటికీ కాలేరు:అబ్దుల్లా
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. వాజ్ పేయిలా మోడీ ఎన్నటికీ సెక్యూలర్ నేత కాలేరని అభిప్రాయపడ్డారు. వాజ్ పేయి కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినా, ఆ సంస్థ సిద్ధాంతాలను వదిలిపెట్టి అన్ని మతాలను కలిపి ఉంచేందుకు పనిచేశారని చెప్పారు. 'నేను హిందువుని, హిందువుల వికాసాన్ని చూడడమే నా ఉద్యోగం' అని మోడీలా వాజ్ పేయి చెప్పలేదన్నారు.