: 2004లో తెలంగాణను అడ్డుకున్నది కేసీఆరే: విజయశాంతి
కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదని... 2004లో తెలంగాణ ఇద్దామనుకున్న సోనియాను ఆయన అడ్డుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొంతమంది ఆయనను గాంధీతో పోలుస్తున్నారని... పొద్దున లేచినప్పటి నుంచి సమైక్యవాదులు, నాయకుల వద్ద డబ్బులు వసూలు చేసే కేసీఆర్ ను గాంధీతో పోల్చడం మహా పాపమని తెలిపారు. దేశంకోసం సర్వం త్యాగం చేసిన మహాత్ముడు ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అంటూ మండిపడ్డారు.